నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ నుంచి ఓ ఇనుప రాడ్డు కారుపై పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని కొండాపూర్లో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే అటుగా వెళ్తున్న ఓ కారుపై ఫ్లైఓవర్ పైనుంచి భారీ ఇనుప రాడ్డు పడింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఆ రాడ్డు కారు ముందు భాగంలో పడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే కాస్త వెనుక భాగంలో జరిగి ఉండే ప్రాణనష్టం వాటిల్లేది. కాగా.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్మాణ పనులు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కారు యజమాని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital