Saturday, November 23, 2024

ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద.. గేట్లు ఎత్తివేత

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 93,836 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 1,01,558 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.230 టీఎంసీలుగా కొనసాగుతుంది.

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 19,309 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,402 అడుగులుగా కొనసాగుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17 టీఎంసీలుగా ఉండగా..ప్రస్తుతం 13.696 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు మూసీ ప్రాజెక్ట్‌కు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు ప్రాజెక్ట్  5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,343 క్యూసెక్కులు కొనసాగుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.62 టీఎంసీలుగా ఉంది.

ఇది కూడా చదవండి: వెదర్ అలర్ట్: మరో మూడు రోజులు వానలే వానలు

Advertisement

తాజా వార్తలు

Advertisement