Saturday, September 14, 2024

TG | కడెంలోకి భారీగా వరద నీరు.. మూడు గేట్లు ఎత్తివేత

జన్నారం, (ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్) : నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లను ఎత్తివేసి 11016 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఈ మేరకు కడెం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ వైటల్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రకటించారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం రాత్రి 7 గంటల వరకు 690.400 అడుగుల నీరు ప్రాజెక్టులోకి చేరిందని తెలిపారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందన్నారు.

ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం 15338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని, ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో 3 వరదగేట్లు ఎత్తి 11099 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, పశువుల కాపరులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement