గోదావరికి ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వరద కారణంగా మంగళవారం రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉంది. దీంతో ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కోరారు. రహదారులపై నీళ్లు చేరిన ప్రాంతాల్లో రవాణా నియంత్రణకు బారికేండింగ్ చేయడం లేదా ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు నీళ్లు చేరిన రహదారుల్లో ప్రయాణం చేయొద్దని, ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పారు. పశువులను బయటకు మేతకు వడలకుండా ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Warning: గోదావరికి మళ్లీ భారీగా వరద.. భద్రాచలం వద్ద 56 అడుగులకు చేరిన ప్రవాహం
Advertisement
తాజా వార్తలు
Advertisement