Tuesday, November 26, 2024

TS : నేడు, రేపు వడగాడ్పులు…

మండె ఎండ‌ల‌తో ఉదయం 9 దాటితే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం వేళ భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది.

- Advertisement -

ఉష్ణోగ్రతలు సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొన్నది. ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో కూడా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

హైదరాబాద్లోనూ తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 42-43°C దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ రెండు రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల ప్రాంతంలో ప్రజలు బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వడగాల్పుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈనేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement