Friday, November 15, 2024

ADB | చిన్నారి ఆయుష్షు తీసిన గుండెపోటు…

చెన్నూర్ (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం పద్మనగర్ కాలనీకి చెందిన పన్నెండేళ్ళ కస్తూరి నివృతి (12) బాలిక శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన ఘటన కాలనీలో విషాదాన్ని నింపింది. పట్టణ పద్మనగర కాలానికి చెందిన కస్తూరి రమ్య శ్రీనివాస్ దపంతుల కూతురు నివృత్తి (12) స్థానిక ఆశిష్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది.

శుక్రవారం కార్తీక పౌర్ణమి ఉదయాన్నే ఇంట్లో ఒకేసారి కుప్పకూలి పోవడంతో గమనించిన శ్రీనివాస్ రమ్య చిన్నారిని హుట హుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి నివృతి గుండె పోటుతో మృతి చెందినట్లు ప్రాథమికంగా వైద్యులు పేర్కొన్నారు. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement