ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెల్త్ మేళాను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లు ప్రారంభించారు. జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన మేళాలో వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ వాసుదేవ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement