సిద్దిపేట జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజలందరికీ ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. యోగాని నిత్యా జీవితంలో భాగం చేసుకోవాలని, దీంతోటి దీర్ఘాయుష్షును పొందాలని సూచించారు. ప్రపంచంలో చాలామందికి మనం తీసుకునే ఆహారం, అలవాట్ల వలనే రోగాలు వస్తాయన్నారు. యోగా చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెప్పారు.
పిల్లల నుండి పెద్దల వరకు యోగా చేయవచ్చని, ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదన్నారు మంత్రి హరీశ్‌రావు. యోగా చేస్తే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకోవచ్చని, వాకింగ్, సూర్య నమస్కారాలు వలన రోజు మరింత పనులు ఈజీగా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు యోగా వంటి శిక్షణ ఇస్తున్నామని, నార్మల్ డేలవరీలకు ఇట్లా చేయడం మంచి జరుగుతుందని తెలిపారు.