ఢిల్లీ ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్
బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు
లంగ్ ఇన్‌ఫెక్షన్‌కు కొనసాగుతున్న చికిత్స
ఏడుగురు డాక్టర్ల బృందం పర్యవేక్షణ
సీపీఎం శ్రేణుల్లో ఆందోళన
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం బాలేదు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. అయితే.. ఏచూరి హెల్త్ సిచ్యుయేషన్‌పై డాక్టర్లు బులెటిన్ ప్రకటించారు. కాగా, ఆయన ఆరోగ్యం బాలేదని తెలిసి పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం రెస్పిరేటరీ సపోర్ట్‌పై ఉన్నారని డాక్టర్ల బృందం తెలిపింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఏచూరి ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో డాక్టర్లు ఏచూరికి వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.