Saturday, November 23, 2024

తెలంగాణ మరో మహారాష్ట్ర కాకూడదు: హెల్త్ డైరెక్టర్

‌కరోనా వైర‌స్ గాలి ద్వారా కూడా సోకే అవకాశముందంటూ తెలంగాణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోందని… గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు.

ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. ఆస్ప‌త్రుల్లో బెడ్ల‌కు కూడా కొరత ఏర్పడుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మొద‌టి ద‌శ కంటే మ‌రింత వేగంగా వైర‌స్ వ్యాపిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఒక్క ఇంటిలో ఎవ‌రికైనా క‌రోనా సోకితే.. గంట‌ల్లోనే అది మిగిలిన వారికీ సంక్ర‌మిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.మ‌రో నెల నుంచి రెండు నెల‌ల వ‌ర‌కు రాష్ట్రంలో ఇదే తీవ్రత కొన‌సాగుతుంద‌ని డీహెచ్‌వో శ్రీనివాస్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement