హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా డాక్టర్ రమేశ్ రెడ్డి స్థానంలో త్రివేణిని నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా డీహెచ్‌గా పని చేసిన శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని, కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ గులాబీ అధినేత టికెట్ నిరాకరించడంతో సైలెంట్ అయ్యారు. ఇక శ్రీనివాసరావు తీరుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ అతడికి స్థాన చలనం కల్పించింది.