Tuesday, December 3, 2024

TS : ప్ర‌మాద‌వ‌శాత్తు బిల్డింగ్ పై నుంచి ప‌డి హెడ్ కానిస్టేబుల్ మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు బిల్డింగ్ పై నుంచి ప‌డి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు శ్రీ‌నివాస్‌ ఇందల్వాయి మండల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

- Advertisement -

సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఇందల్వాయి మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నూతనంగా నిర్మిస్తున్న భవనం ఒకటవ అంతస్తులో పైపుతో నీరు కొడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి కింద పడడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement