హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో తెనాలి యువకుడు ఉదయ్ (23) ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి అతడు చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌కు వెళ్లాడు. హోటల్ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్ వెంటపడింది.
దాని నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ నుంచి ఉదయ్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -