శంకర్‌పల్లి, మార్చి 4(ప్రభన్యూస్)
అప్పుల బాధ అభశుభం తెలియని చిన్నారులను కబలించింది. చిన్నప్పటి నుంచి అల్లరు ముద్దుగా పెంచుకుతున్న పిల్లలను కడతేర్చాడు ఓ తండ్రి. తండ్రి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కానీ పిన్న వయస్సు వారిది. చిన్నారులనే కనికరం కూడా లేకుండా వారిని విగతజీవులుగా మార్చి తాను తనువు చాలించాడు. అప్పులు వారి ప్రాణాలనే హరించివేశాయి. ఈ హృదయవీదారక సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గత 15 సంవత్సరాల నుండి ప్రో ఆగ్రో లో పని చేసేవాడు. గత కొంతకాలంగా స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి 3000.. లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. తీరా చూస్తే డబ్బులు రాలేదు. దీంతో డబ్బు కట్టిన ప్రజలు ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచక ఇంట్లో పిల్లలను చంపి రవి కూడా పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన పై మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అత్యాశతో కుటుంబాన్నే పొగొట్టుకున్నాడు….
అత్యాశకు ఆశపడి చివరికి కుటుంబాన్నే పొగొట్టుకున్నాడు ఓ తండ్రి. చిన్న నాటి నుంచి ఎంతో ప్రేమను ఒలకబోస్తూ పెంచుకున్న వారినే చివరకు పొట్టనబెట్టుకున్నాడు. డబ్బుసంపాదనే లక్ష్యంగా పెట్టుకొని చేసిన పొరపాటు ఆ ముగ్గురి పిల్లలకు పాశవికశంగా మారింది. మితిమిరీన డబ్బు పిచ్చితో అప్పులు చేసి తీర్చే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈఘటన అందరినీ తీవ్ర విషాధంలో ముంచెత్తింది. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి కన్నీళ్లు ఆగలేకపోయాయి.
రుణభారం…ప్రాణభయం…
సాధారణంగా జీవితం అన్న తర్వాత ఇంట్లో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలి కానీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి వెనకడుగు మాత్రం చేయకూడదు.అయితే కొందరు కష్టాలను ఎదిరించి జీవితంలో ముందుకు సాగగా మరికొందరు ఆ కష్టాలను చూసి భయంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి భయం ఒక కుటుంబాన్ని దారుణంగా బలిగొంది. అప్పులబాధతో సతమతమైన ఆ కుటుంబం కన్నపేగుని తన చేతులతో చంపి అతడిని కొల్పోయింది.