కరీంనగర్ – రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన సందర్భంగా బీ.ఆర్.ఎస్.పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో బారి కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. అనంతరం పూల మరియు పండ్ల మొక్కలు ,మిఠాయిలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా మేయర్ వై.సునీల్ రావు హాజరు కాగా, , జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ మాజీ ఎమ్మెల్సీనారదాసులక్ష్మణరావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవెని మధు, బీ.ఆర్.ఎస్.పార్టీపార్టీ కార్పొరేటర్లు , బీ.ఆర్.ఎస్ .పార్టీ నాయకులు. పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.