Saturday, September 7, 2024

HBD – కేటీఆర్ జన్మదినం – మొక్కలు నాటిన ఎమ్మెల్సీ రాజు

కుత్బుల్లాపూర్, జులై 24 (ప్రభ న్యూస్): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతు మంత్రి కేటీఆర్ నిండు, నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్ లో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాక్షించారు.

మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా జిల్లా పరిధిలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలువునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, జీతయ్య, ప్రదీప్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement