హైదరాబాద్ – తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఈయన ఫేస్‌బుక్ పేజీను కొందరు హ్యాక్ చేశారు. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో రాజకీయాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసిన నాయకులు, ప్రజలు ఒక్కసారిగా బీజేపీ, టీడీపీ, తమిళనాడుకులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు రావడంతో షాక్ తిన్నారు. అయితే కొందరు నాయకులు దామోదరకు కాల్ చేసి సార్ మీ ఫేస్ బుక్ లో పోస్ట్ ఏంటి సార్ అలా పెట్టారు? అని ప్రశ్నించారు. అయితే దామోదర మా పార్టీకి సంబంధిచినవే కదా అని చెప్పడంతో ఖంగు తిన్నారు.
దీంతో అప్రమత్తమైన మంత్రి దామోదర తన ఫేస్ బుక్ అకౌంట్ ను పరిశీలించుకున్నారు. అంతే మంత్రి ఒక్కసారి నిర్ఘాంత పోయారు. వెంటనే అధికారులకు అప్రమత్తం చేశారు. తన ఫేస్ బుక్ ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. దీంతో అధికారులు స్పందించారు. హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారు. మంత్రి దామోదర ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకుస్పందించవద్దని మంత్రి అనుచరులు కార్యకర్తలకి మనవి చేశారు. మంత్రి నుంచి ఏదైనా సరే మెసేజ్ వచ్చినా దానికి రిప్లై ఇవ్వద్దని, ఆ సమాచారాన్ని పోలీసులకు తెలిపాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు