హైదరాబాద్ – తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. హరితోత్సవంలో పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. కాగా, గ్రీన్ ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే ఔట్‌లో నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఎంపీ సంతోశ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిసి కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి,రాఘవ, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాలలో హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పచ్చదనం గురించి చైతన్యం తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఎంతో పచ్చదనం పెరగడం జరిగిందని అన్నారు. తెలంగాణ హరితోత్సవం లో బాగంగా ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ ఔట్ లో మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి ఎంపీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ హరితోత్సవం లో బాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి ఉప్పల్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతున్నారు.హరితహారం,గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా గ్రీనరీ పెరిగిందని అన్నారు..