Tuesday, November 26, 2024

Harithosava Puraskaar కరీంనగర్ ఖాతాలో మరో ఉత్తమ అవార్డు..

కరీంనగర్ నగరపాలక సంస్థ ఉత్తమ అవార్డు కు ఎంపికైంది. ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నప్పటికీ… మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హరితోత్సవ పురస్కార అవార్డులను ప్రకటించింది. అందులో లక్ష పైబడిన నగరాల కేటగిరి పట్టణాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ ఉత్తమ హరిత అవార్డు కు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో కరీంనగర్ నగరపాలక సంస్థ గత 9 విడుతలను విజయవంతంగా చేసింది. నగరాన్ని గ్రీన్ సిటీ మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ప్రత్యేక 10 శాతం గ్రీన్ బడ్జెట్ తో ప్రతి సంవత్సరం హరితహరం చేపట్టి… నగర వ్యాప్తంగా దాదాపు 70 ఏకరాల్లో వివిధ పద్దతుల్లో, బ్లాకుల్లో చిట్టడవులు, పట్టణ ప్రకృతి వనాలను… నర్సరీలను పెంచీ సంరక్షిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సీడీఎంఏ అవార్డు కు ఎంపిక చేసింది

ఈ ఉత్తమ హారితహారం అవార్డు ను రేపు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ లు ప్రభుత్వం నుండి స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యాక్రమాన్ని నగరపాలక సంస్థ విజయవంతంగా నిర్వహించి… నగర వ్యాప్తంగా చక్కటి గ్రీన్ కవర్ ( లంగ్స్ బేస్) పెంచి సంరక్షించడంలో అవార్డు ను ప్రకటించిందన్నారు.

నగరంలో 70 ఏకరాలను తీస్కోని చిట్టడవులు పట్టణ ప్రకృతి వనాలను పెంచామన్నారు. నగరంలోని పద్మానగర్, మానేరు డ్యాం, సదాశివ్ పల్లి, పిల్టర్ బెడ్, ప్రధాన రహాదారులు, డివిజన్ లు ఇలా ప్రతి ఖాళీ స్థలం ఉన్న చోట పెద్ద ఎత్తున యాదాద్రి, మియావాకీ, ఎవెన్యూ, బ్లాక్ పద్దతుల్లో మొక్కలు నాటి రక్షించడంతో పాటు నగరంలో 11 నర్సరీలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇందుకు నగరపాలక సంస్థ కు మరో అవార్డు వచ్చిందని తెలిపారు. నగరపాలక సంస్థ లో ఇప్పటికే స్వచ్చ్ సర్వేక్షన్ లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాల రేటు పెంచడంలో అవార్డు మరియు సఫాయిమిత్ర సురక్షా చాలేంజ్ లో 4 కోట్ల నగదు అవార్డు మొన్నటికి మొన్న స్టీల్ వెండర్, సమైఖ్యా సంఘాల నిర్వహణ లో మరో అవార్డులు రావడం జరిగిందన్నారు

. హరితహారం లో మరో అవార్డు నగరపాలక సంస్థ కు చాలా గర్వకారణం అన్నారు. ఈ అవార్డు ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, పాలకవర్గ సభ్యుల సహకారం మరియు మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల ప్రోత్సాహం తో లబింఛిందన్నారు. ఈ అవార్డు నగరపాలక సంస్థ కు దక్కడం చాలా సంతోషం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement