Friday, November 22, 2024

Tributes | జయశంకర్ సార్ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి: మంత్రి హరీశ్​

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆగస్టు 6 (ప్రభ న్యూస్): తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన మహనీయులు ఆచార్య జయశంకర్ సార్ అని మంత్రి హరీష్ రావు కీర్తించారు. ఆచార్య జయశంకర్ సర్ 89వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
“జయశంకర్ సార్ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం నీళ్లు.. నిధులు.. నియామకాల లక్ష్యం చేరేందుకే అని అనేవారు. నేడు కాళేశ్వరం జలాలతో కోటి ఎకరాల మాగాణి గా చేసుకున్నాము.. నిధుల్లో దేశంలో నే ధనిక రాష్ట్రం గా దేశాన్ని సాదుతున్న మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ ఊతం ఇస్తున్నది.. నియమాకాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది.. మరో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం.. ఇది ఆచార్యుని కలలు కన్న నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది… నాడు జయశంకర్ సర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అణువునవును చూసి అవమానం ..బాదను దిగమింగుతూ కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్పే వారు.. అలాంటి వారి కల నేడు నెరవేరుతున్న సందర్భంలో వారు ఉంటే ఎంతో సంతోష పడే వారు ” అని అన్నారు..

ఆచార్య జయశంకర్ టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కి కి చేదోడువాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లో సూచనలు, సలహాలు అందించారన్నారు… ఆయన మన మధ్య లేకున్నా ఆయన పోరాటం పటిమ ,ఆయన తపన రాష్ట్ర సాధనలో అయన కృషి ఎవరు మర్చిపోలేరని చెప్పారు.. .2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి వచ్చిన ప్రకటన జయశంకర్ స్వయంగా రాసి కేంద్ర హోంశాఖ కు పంపిస్తే ఆనాడు కేంద్రం ప్రకటన చేసిందన్నారు….ప్రధాన మంత్రులకు, రాష్ట్రపతి లకు వినతిపత్రం ఇవ్వాలన్న శ్రీ కృష్ణ కమిటీకి తెలంగాణ ఎందుకు ఇవ్వాలో చెప్పాలన్న ప్రతి అంశంలో జయశంకర్ సార్ ఉన్నార‌ని తెలిపారు… విద్యావంతులను,మేధావులను, ఉపాధ్యాయులను చైతన్య పరుస్తూ రాష్ట్రం కు జరుగుతున్న వివక్షను,రాష్ట్రం ఎందుకు అనే ఆవశ్యకతను వివరించారు వారు జయశంకర్ అని.. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నామని చెప్పారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడలన్నపుడు తెలంగాణ కి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన దగ్గర నేర్చుకొని అసెంబ్లీలో బల్ల గుద్ది వాదించి చర్చించామని, ఆయన.. అదే అసెంబ్లీ లో నేడు ఒకటొకటిగా సాకారం చేసుకుంటున్నామని చెప్పారు.. వారికి ఎప్పుడు సీఎం కేసీఆర్ , ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.. వారి పేరు తో భూపాలపల్లి జిల్లా కు జయశంకర్ జిల్లా గా పేరు మార్చు కున్నాన‌మ‌ని,, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం గా పేరు పెట్టుకున్నామని చెప్పారు. .. ఆయన ఆశయ సాధన , ఆయన జీవం మన మధ్యలో లేకపోయిన్నప్పటికి ఆయన మన గుండెల్లో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారని…వారి ఆశయాలని కోసాగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement