Saturday, November 23, 2024

భారీ వ‌ర్షాలు .. సిద్దిపేట ప‌రిస్థితిపై అధికారుల‌తో టెలి కాన్ఫ్ రెన్స్

సిద్ధిపేట – భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సిద్దిపేట పరిస్థితులను అధికారులను తెలుసుకున్నారు. అన్ని చెరువులు, కుంటలు, వాగులు, వంకల వద్ద పరిస్థితులు పరిశీలించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదేశించారు…

చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దని, విద్యుత్తు, విద్యుత్ ఉపకరణాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంచి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారు మున్సిపాలిటీలో సమాచారం అందిస్తే పునరాసం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మంత్రి ఆదేశాలతో మున్సిపల్ పాలకవర్గం, పోలీసులు బృందంగా ఏర్పడి అన్ని చెరువులు, వాగులు, వంకల వద్ద పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి, మంత్రి ఓ ఎస్డీ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఇన్‌చార్జి చైర్మన్ కనకరాజు, పలువురు కౌన్సిలర్లు పట్టణమంతా కలియ తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement