Wednesday, November 20, 2024

ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మీరు రాష్ట్రపతిని పిలుస్తున్నారా – గవర్నర్ ను నిలదీసిన హరీశ్ రావు

హైదరాబాద్ – సచివాలయం ప్రారంభానికి గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగం లో ఉందా ? అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ,. పార్లమెంటు శంకుస్థాపనకు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా ? అని ప్రశ్నించారు. వందే భారత్ ట్రైన్ల ప్రారంభిస్తున్న ప్రధాని రాష్ట్రపతిని పిలుస్తున్నారా ? అని వ్యాఖ్యానించారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన హరీశ్ రావు.. మహిళా గవర్నర్‌గా తమిళిసైపై తమకు గౌరవం ఉందని.. కానీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని గవర్నర్ భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారని.. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా ? అని హరీశ్ రావు అన్నారు. వైద్య శాఖలోప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారని…ఆ బిల్లులో అభ్యంతర కరమైన అంశాలు ఏమి ఉన్నాయని అన్నారు. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవీ విరమణ పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 70 ఏండ్లకు పదవి విరమణ వయసును పెంచవచ్చని మార్గదర్శకాల్లో ఉందని హరీశ్ రావు చెప్పారు. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. –

ఉమ్మడి జాబితా లో కొన్ని అంశాలు రాష్ట్రం జాబితా లో మరి కొన్ని అంశాలు ఉంటాయని.. వాటికి అనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేదా అని చూడటం వరకే గవర్నర్ భాద్యత అని హరీశ్ రావు అన్నారు. సుప్రీం కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చని.. ఈ బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించారు. పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడం వల్ల గవర్నర్ ప్రజలకు నష్టం కలిగించలేదా ? అని అన్నారు. ఒక డాక్టర్ అయి ఉండి తమిళసై ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా ? అని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టులో కేసు వేసే దాకా గవర్నర్ స్పందించలేదని.. చివరకు తిరస్కరించి రాష్ట్రపతికి పంపారని హరీశ్ రావు గుర్తు చేశారు. తన ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారని ఆరోపించారు. బీహార్, ఝార్ఖండ్, ఒడిశాల్లో ఎన్నో యేండ్ల నుంచి యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ నడుస్తోందని… ఇక్కడ గవర్నర్ కు దీనిపై ఎందుకు అభ్యంతరమని హరీశ్ రావు నిలదీశారు

కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ మామూలు వ్యక్తి కాదని.. ఆమె ఎన్నోసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని అన్నారు. గవర్నర్ ఎన్ని సార్లు పోటీ చేసినా గెలిచారని ప్రశ్నించారని అన్నారు. కెసీఆర్ ప్రజల మనిషి అని.. ఒక్క బటన్ నొక్కి సీఎం కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించారని అన్నారు. రజనీకాంత్ తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి అని..ఆయన ఉన్నదున్నట్టు మాట్లాడారని హరీశ్ రావు తెలిపారు. గవర్నర్ కు ఆయనకు తెలిసిన విషయాలు కూడా తెలియవా ? అని అన్నారు. పంచాయతీ స్థానిక సంస్థల్లో అవిశ్వాసానికి నాలుగేళ్ల కనిష్ట పరిమితిని పెంచితే గవర్నర్ కు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి కోణంలో ఆ నిర్ణయం తీసుకున్నామని.. గవర్నర్ అలాంటి బిల్లును ఆపొచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ బీజేపీ కనుసన్నల్లో పని చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ కు రాజకీయాలు ఇష్టముంటే మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేయొచ్చని హరీశ్ రావు సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement