Friday, November 22, 2024

రైతులను కేంద్రం నట్టేట ముంచింది: హరీశ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే… ఢిల్లీ పెద్దలు అవమానించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని గతంలో కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చేసరికి వద్దంటున్నారని మండిపడ్డారు. పంట పండించిన రైతులు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. పామ్ ఆయిల్ పంటతో ఎక్కువ లాభాలు ఉన్నాయన్న హరీశ్… రైతులు ఈ పంటను అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి సారించాలని మంత్రి హరీశ్ సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement