Saturday, November 23, 2024

బర్త్ డే వేడుకలకు హరీష్‌ రావు దూరం

ఈ ఏడాడి తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావు నిర్ణయించారు. లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు హరీష్‌ రావు తెలిపారు. గురువారం(జూన్ 3త) హరీశ్ రావు పుట్టినరోజు కావడంతో… వేడుకలను నిర్వహించేందుకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అయితే ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు.

‘మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజ్ఞతలు’ అని హరీష్‌ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement