Tuesday, November 26, 2024

Harish Rao – ఆడపడుచులు ఆరోగ్యంగా ఉండాలనే కెసిఆర్ ఆలోచ‌న‌లోంచి పుట్టిందే “రుతు ప్రేమ”

ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్) – సి ఎం కేసీఆర్ ఆలోచనలో పుట్టిన మరో అద్భుత కార్యక్రమమే రుతు-ప్రేమ అని
తెలంగాణ లో జీవించే ప్రతి ఆడబిడ్డ ల్ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్ధిక వైద్య-ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 30, 31వ వార్డుల్లో రుతుప్రేమ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, యువతుల వ్యక్తిగత పరిశుభ్ర పరమైన, హానికర వ్యర్థాలు వెలువడని పరిసరాల అవగాహన సదస్సు, ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్స్ ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేట కుటుంబంగా కలిసి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చని, ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదని మా ఆడపడుచులంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే మా తపనతో అని అందుకోసమే ఈ రుతుప్రేమ కార్యక్రమం
చేపట్టినట్లు మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ రుతుప్రేమతో మహిళలకు డబ్బు ఆదా, ఆరోగ్య రక్షణ, స్వచ్ఛ సిద్ధిపేట కోసం పవిత్రమైన యజ్ఞం చేస్తున్నామని హరీశ్ రావు చెప్పారు. ప్రభుత్వం తరపున అభివృద్ధి నిర్మాణాలు, సంక్షేమం ఎప్పుడూ ఉండేదే. కానీ ప్రత్యేకంగా మహిళలు ఆరోగ్యంగా, సంతోషంగా, రోగాల బారిన పడకుండా చేసే ప్రయత్నమే ఈ రుతుప్రేమగా తెలిపారు.

రుతుచక్రం లేకుంటే జీవన చక్రం లేదని, మనిషి మనుగడకు మూల కారణం రుతుచక్రం. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల్లో ఈ మెన్స్ట్రువల్ కప్పులు వాడుతున్నారని, వారి తరహాలోనే మన సిద్ధిపేట అక్కా, చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలని ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా చేస్తున్న సంస్కరణలలో భాగంగా చెత్త రహిత, కుండీలు లేని సిద్ధిపేటగా మార్చుకున్నామని తెలిపారు. ఈ గొప్పతనం సిద్ధిపేట ప్రజలతోనే సాధ్యమైందని, తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరు చేసి ఇచ్చిన ఘనత మీదేనంటూ ఈ ఘనత మీకే దక్కుతుందని ప్రజలకు మంత్రి అభివాదం చేశారు. 99 శాతం సక్సెస్ అయ్యామని, మిగిలిన1 శాతం కూడా క్షేత్రస్థాయిలో సమూల మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్, సిద్ధిపేట రూరల్ మండలాల మహిళలు రుతుప్రేమ కప్పులు వాడుతున్నారని, వారి తరహాలోనే మన పట్టణ మహిళలు సైతం ముందుకొచ్చి ఈ రుతుప్రేమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సిపి శ్వేత, డాక్టర్ శాంతిలను కొనియడిన మంత్రి హరీష్ రావు

- Advertisement -

ఆదివారం అయినప్పటికీ సిద్ధిపేట జిల్లా పోలీసు కమిషనర్ ఐపీఎస్ శ్వేత, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ కార్యక్రమానికి వచ్చి మాతోటి అక్కా, చెల్లెలు ఆరోగ్యంగా ఉండాలని ముందుకొచ్చి నిలవడం స్ఫూర్తి దాయకమన్నారు.
పౌర, సామాజిక బాధ్యతతో సిద్ధిపేట ప్రజారోగ్యం కోసం పని చేస్తున్నామని, ఇవాళ వేకువజామున 6 గంటలకే డిగ్రీ కళాశాల నుంచి పాత బస్టాండు వరకూ నడుస్తూ చెత్త తొలగిద్దాం కార్యక్రమంలో హాజరై రోడ్డుపై ఉన్న చెత్తను ఏరివేసి అందరిలో స్ఫూర్తిని నింపారని సీపీ శ్వేతను మంత్రి అభినందించారు. అలాగే ప్రత్యేకించి తోటి మహిళ ఆరోగ్యాన్ని కాపాడేలా తమవంతు సామాజిక తోడ్పాటు అందిస్తున్నారని, బెంగళూరు నుంచి ఇక్కడికి మీ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న డాక్టర్ శాంతి సేవలు అభినందనీయమని కొనియాడారు.

ప్రతీ మంగళవారం ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో జరిగే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. అలాగే ఫ్రై డే డ్రై డేగా జరపాలని వర్షాకాల రీత్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శుక్రవారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూడాలని, నిల్వ ఉన్న నీటిలో దోమ లార్వా ఉంటాయని, దీంతో డెంగీ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నదని, ప్రతీ ఇళ్లు శుభ్రంగా నిలిపినట్లే, గల్లీ, పట్టణాన్ని శుభ్రంగా నిలపాలని ప్రజలను కోరారు.

అవగాహన ఎంతో ముఖ్యం – అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్
మా కుటుంబంలో అమ్మతో తప్పితే ఫాదర్, బ్రదర్ తో ఈ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడలేదని, కానీ ఇవాళ ఇలాంటి బహిరంగ సభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమక్షంలో ఈ రుతుప్రేమ పై చర్చించడమే మన మహిళల మొదటి విజయంగా భావించాలన్నారు. తడి, పొడి వేర్వేరుగా చేస్తున్న క్రమంలో ఈ హానికరమైన చెత్తలో భాగమైన శానిటరీ ప్యాడ్స్ వల్ల ఎంత నష్టమో వివరించారు. రుతుప్రేమ మెన్స్ట్రువల్ కప్పుల ద్వారా డబ్బులు ఆదా, ఆరోగ్య రక్షణ, సిద్ధిపేట స్వచ్ఛత ఉంటుందని, ఆ దిశగా ప్రతీ మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏంపీ బీబీ పాటిల్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్ బంధారం శ్రీలత, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement