గజ్వేల్, నవంబర్ 25(ఆంధ్రప్రభ) : సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతదేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… రామచంద్రారెడ్డి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు ఎంతో ఆత్మీయులన్నారు. రామచంద్రారెడ్డి నిత్యం ప్రజాసేవ, అభివృద్ధిపైనే తపన పడ్డారన్నారు.
రామచంద్రారెడ్డి కోరిక మేరకు గత కేసీఆర్ ప్రభుత్వంలో రూ.10కోట్లు గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. రామచంద్రారెడ్డి ఆసుపత్రి వైద్య ఖర్చులకు గత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయన్ని అందించారు. అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసి గౌరవించుకున్నామన్నారు. వారి మృతి బాధాకరం, దురదృష్టకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.
- Advertisement -