సిద్దిపేట – పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్‌లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3లక్షల ఇంటి మహాలక్ష్మి పేరుమీద ఇస్తున్నామన్నారు. మహిళలకు డబ్బులు ఇస్తే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందన్నారు. అందరికీ ఒకేసారి ఇవ్వడం ఇబ్బందని, ముందువెనుకా అందరికీ ఇస్తామన్నారు. అందరు మనవాళ్లేనని, ఉండేది మన ప్రభుత్వమే.. సీఎం మన కేసీఆరేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో లంచాలు ఇచ్చిన ఇల్లు దక్కలేదని, తిరిగి తిరిగి కళ్లు అరిగేవన్నారు. మన ప్రభుత్వంలో ఏ మధ్యవర్తులు లేకుండా పైరవీలు లేకుండా నేరుగా ఖాతాల్లోనే డబ్బులు జమచేయనున్నట్లు పేర్కొన్నారు.
లంచం, మిత్తి, అప్పు లేదని, ఎది లేకుండా మీకు పైసలు వస్తాయని, మన దగ్గర ఎవ్వరు మిమ్మల్ని డబ్బులు అడగరని.. తప్పుదారి ఎవరైనా అడిగితే తనకు చెప్పాలన్నారు. పంచాయతి సెక్రెటరీ, సర్పంచ్ అందరూ మీకు అందుబాటులో ఉండి డబ్బులు ఇప్పిస్తరు. మీరు త్వరగా పని మొదలుపెట్టాలని.. రెండు నెలల వరకు చూసి పని స్టార్ట్ చెయ్యని వారికి బదులు మరొకరిని ఎంపిక చేస్తామన్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు తమకు నీళ్లు వచ్చాయని రెండు పంటలు బాగా పండుతయని సంతోషంగా ఉన్నారన్నారు.నాడు పాలమూరు జిల్లా కరువు పీడిత, వలసలు పోయిన ప్రాంతమని, పాలమూరు ప్రజల కళ్లల్లో ఆనందం వేస్తే.. కానీ కాంగ్రెస్ వాళ్ల కళ్లలో కన్నీళ్లు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాజెక్టులకు అడ్డంపడడం.. కేసులు పెట్టించి పనులు ఆపే ప్రయత్నం చేశారని, – మన ప్రభుత్వం అభివృధి ముందుకు పోతుంటే.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ తిట్లు తిటడ్డంలో పోటీపడుతున్నారన్నారు. పని చేసిన ప్రభుత్వం వైపు ఉంటారా..? గోబెల్స్, అబద్ధాలు ప్రచారం చేసే వారి వెంట ఉంటారా ? సద్ది తిన్న రేవు తలవాలి.. సహాయం చేసిన వారిని మరవొద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మన ప్రాజెక్ట్ కాలువల్లో నీళ్లు పారుతున్న ఒక సుక్క రాలేదు అంటున్నారని విమర్శించారు