Tuesday, November 26, 2024

Siddipet – యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించిన మంత్రి హరిష్ రావు

సిద్ధిపేట గ్రామీణం:ఒకప్పుడు కరువు పడ్డది. కైకిలికి పోవాలని పోయేది. కానీ ఇవాళ, కరువు మాయమైంది. కైకిలోళ్లు దొరుక్తలేరనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం చేరిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట గ్రామీణ మండలం ఇర్కోడ్ గ్రామంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇర్కోడ్ లో యూనియన్ బ్యాంకు రావడం చాలా సంతోషంగా ఉన్నదని, ఈ గ్రామం, చుట్టూ పక్కల రైతులు, గ్రామస్తులంతా గతంలో క్రాప్ లోన్, బ్యాంకు సంబంధిత ఏ చిన్న పనులకైనా టౌన్ వెళ్లి వ్యయప్రయాసాలు పడేవారని, ఇర్కోడ్ కే యూనియన్ బ్యాంకు రావడంతో అందరికీ సౌలత్ ఉంటుందని, ఇక మీ బాధలు తొలగాయని గత కాల పరిస్థితి వివరించారు.సిద్ధిపేట నియోజకవర్గ సరిహద్దు వరకూ ఫోర్ లేన్ రహదారి చేసుకుంటున్నామని, మెదక్ రోడ్ న తిమ్మాపూర్ గ్రామం వరకూ ఉన్న తొర్నాల, ఇర్కోడ్, బూర్గుపల్లి గ్రామాల మీదుగా నాలుగు లేన్ల రహదారి, డివైడర్, రెండువైపులా వెలుగులు విరజిమ్మేలా వీధి దీపాలు వస్తున్నాయని తెలిపారు.

అనంతరం ఇర్కోడ్ గ్రామ 24 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని బీజేఆర్ సర్కిల్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ భవనం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం రూ.కోటి నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement