Friday, November 22, 2024

నేను నిల్చుంటే ఈటల ఓడిపోతాడు : హరీష్ రావు..

ఈటెల రాజేంధర్ పై మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం గుప్పించారు. ఓ కార్యకర్త చేతిలో ఓడిపోతే బాగుండదని ఈటెల కు ఆర్ధం అయిందని. ఇక నేను నిల్చుంటే ఈటల ఓడిపోతాడు అని హరీష్ రావు అన్నారు. అందుకే నన్ను పోటీ చేయాలని ఈటెల అడుగుతున్నాడన ఎద్దేవా చేశాడు. నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించిందని. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే బిసిలు బాగుపడుతారని అడిగామని తెలిపారు. దేశంలో బిసిల జనాభ ఎంత ఉందో మొత్తం లెక్కించాలని తాము కోరినట్లు తెలిపారు. కానీ ఏ ఒక్క పని కూడ కేంద్రం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ఓ వ్యక్తి కేరళ నుండి కేంద్ర మంత్రిని తీసుకు వచ్చి మాట్లాడించిండు. 28మంది బిసిలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారని చెప్పారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి దానికి 10వేల కోట్ల బడ్జెట్ పెడితే బాగు పడుతారు కాని, 28మంది ఉంటే ఏమవుతుంది అని అడిగారు. ఇవేవీ పట్టించుకోని బిజేపి బిసిలను ఎట్లా ఓట్లు అడుగుతుంది అన్నారు. ఓటు వేసేటప్పుడు మహిళలు సిలిండర్ కు దండం పెట్టుకోవాలి. అప్పుడే పక్క టీఆర్ఎస్ కు ఓటు పడుతుంది. తెలంగాణ లో ఇప్పటికే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో మరో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వ బోతున్నాం అని తెలిపారు.

ఇది కూడా చదవండి: జకో కు చెక్..యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement