రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా రైతుల ధాన్యం కొనాలంటూ రోడ్డుపై నిరసనకు దిగారు. జిల్లాలోని అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళనకు దిగడంతో ఆ దారిలో వెళుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు. రైతుల దగ్గరినుంచే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్నికొనుగోలు చేయాలన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు కొనుగోలు కేంద్రాల వల్ల నిల్వ వుంచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి హామీనివ్వడంతో రైతులు నిరసనను విరమించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement