హుజూరాబాద్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సింగాపురం ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ఈటల రాజేందర్ అడ్డుకున్నారని అన్నారు. రైతుబంధు దండగ అన్న వ్యక్తి ఈటల అని పేర్కొన్నారు.
ఆసరా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పనికి రాదన్నారని మండిపడ్డారు. శ్రీమంతుడైన ఈటలకు ఈ పథకాలు అవసరం లేదని.. కానీ పేద వారికి ఈ పథకాలు ఆత్మవిశ్వాసం కల్పించాయని చెప్పారు. బీజేపీ, ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు ఏం చేశారని ప్రశ్నించారు. గెల్లు శ్రీనుకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తనకు అన్నం పెట్టిన ఊరు సింగాపూర్ అని తెలిపారు. తనకు, సీఎం కేసీఆర్ కు ఆతిధ్యం ఇ్చచిన ఊరని చెప్పారు. అబద్దాల బీజేపీ మాటలు నమ్మవద్దని కోరారు. బీజేపీ గెల్చేదిలేదు.. ప్రభుత్వం వచ్చేది లేదన్నారు. నిత్యావసరల ధరల పెంచిన బీజేపీ ఎందుకన్న మంత్రి హరీష్.. టీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ కు పవన్.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?