హైదరాబాద్ – వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తుంటే.. గవర్నర్ ఎందుకు అభినందించరంటూ గవర్నర్ తమిళిసై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు.. అభివృద్ధి కనిపించడం లేదా..? అంటూ ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మెరుగైన ఆరోగ్య తెలంగాణ కోసం ఆరోగ్యశాఖ పని చేస్తోందంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్ శైలి కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు ఉందంటై మండిపడ్డారు. ఎల్లప్పుడూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని .. తెలంగాణ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశామని, వాటి గురించి ఒక్కసారి గవర్నర్ మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. మాతృ,శిశు మరణాలు తగ్గిస్తున్నాం నీతి ఆయోగ్ చెప్పిందని.. చేసిన మంచి పనులపై గవర్నర్ ఎన్నడూ ట్వీట్ చెయ్యలేదని పేర్కొన్నారు. ఒక డాక్టర్ గా.. గవర్నర్ గా.. డాక్టర్లు చేస్తున్న సేవ గుర్తు రావడంలేదన్నారు. మంచి కనబడదు, మంచి వినబడదు, మంచి మాట్లాడకూడదు అన్నటు గవర్నర్ వ్యవహార శైలి..ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం అయింది సీజనల్ వ్యాధులపై జిల్లా వ్యాప్తంగా రివ్యూ కండక్ట్ చేశామని తెలిపారు.