తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. తాను రాజీనామా చేస్తానని.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే..సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు.
అలాగే తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధి పై చర్చ పెడదామని, నేను చర్చకు వస్తానని.. సీఎం రేవంత్ కూడా చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణలోని అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
- Advertisement -