Tuesday, November 19, 2024

Thanks Meeting – గ‌జ్వేల్ లో కెసిఆర్ ను ఓడించేందుకు విపక్షాలు కుట్ర – హ‌రీష్ రావు

గజ్వేల్ లో కేసీఆర్ ని ఓడించడానికి చాలా కుట్రలు జరిగాయ‌ని, అందుకోసం 154 నామినేషన్లు వేయించాల‌రి చూశార‌ని అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు .. గజ్వేల్ లో నేడు జ‌రిగిన బిఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో ఆయ‌న మాట్లాడుతూ.. గతంలో కేటీఆర్ దావోస్ కి వెళ్తే దండగ అన్నార‌ని.. ఇప్పుడు మీరెందుకు వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తార‌న్నారు..

క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ ఓడిపోవ‌డం ఖాయం…
కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేలేద‌ని, .. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయ‌న్నారు..ఇక్క‌డ కూడా హామీలు అమ‌లు చేయ‌కుంటే హ‌స్తం పార్టీకి ఘోర ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు.. . కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు…. పీఎసీఎస్ చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది అని అన్నారు. చాల హామీలు ఇంకా అమలు కాలేద‌న్నారు.. .. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో అబద్ధాలు చెప్పార‌న్నారు.. .. ప్రగతి భవన్ లో 250 రూములు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అని ప్రచారం చేశార‌ని, ఇప్పుడు అక్క‌డ ఏమున్నాయో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. కార్యకర్తలపై కేసులు పెడితే తాను వారి తరపున పోరాడుతాన‌ని ఆయన పేర్కొన్నారు. త‌న‌కు పోలీస్ స్టేషన్ లు , పోరాటాలు కొత్త కాద‌ని చెప్పారు.. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ పార్టీ ఆపేస్తుంది అని హరీష్ రావు ఆరోపించారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement