Friday, September 20, 2024

Harish Rao Appeal – నిండా మునిగారు… రైత‌న్న‌ల‌ను ఆదుకోండి…

హైద‌రాబాద్ – వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు.. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు,కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని, ఆహారం నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement