Thursday, September 19, 2024

HYD: న‌గ‌రంలో హ‌రీశ్ పై ఫ్లెక్సీల క‌ల‌క‌లం..

రాజీనామా కోరుతూ మైనంప‌ల్లి పేరుతో వెల‌సిన ప్లెక్సీలు
నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు

ఆంధ్ర్ర‌ప్ర‌భ స్మార్ట్, సికింద్రాబాద్: పంట రుణాలు మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంతో హరీశ్ రావు రాజీనామా చేయాలని సికింద్రాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కొందరు హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు.

‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధం అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సవాల్ను గుర్తుచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా వైరా సభలో చీము నెత్తురు, సిగ్గు శరం ఉంటే హరీశ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడ అవుతుందని ధ్వజమెత్తారు. ఒకవేళ రాజీనామా చెయ్యకపోతే అమరుల స్థూపం దగ్గర హరీష్ ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement