Thursday, November 21, 2024

విద్యుత్ కోత‌లు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ – హ‌రీష్ రావు..

మెదక్‌: విద్యుత్ కోత‌లు లేని దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.. శంకరంపేటలో రూ.12.38 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారంలో నాలుగు రోజులు పవర్ హలిడేస్‌ ఉండేవని, మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలకుండా పంటలు పండేవి కాదని చెప్పారు. చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులు తగ్గించమంటే రైతులపై కాల్పులు జరిపిన విష‌యాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలే తప్ప మరేమీ లేదని విమర్శించారు. కానీ నేడు రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని, దేశంలో మరెక్కడైనా ఇలా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత‌ రాష్ట్రాలు 16 ఉన్నాయని, అక్కడ రైతులకు 24 గంటల కరెంటు ఎందుకివ్వడం లేదన్నారు. మాటల మనుషులు కావాలో.. చేతల మనుషులు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement