Saturday, November 23, 2024

సిద్దిపేట‌లో ప‌రుగుల సంద‌డి – హాఫ్‌ మారథాన్ ను ప్రారంభించిన మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్కరణ హాఫ్‌ మారథాన్ అని తెలిపారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన పట్టణాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకు పోతున్నామన్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో హాఫ్‌ మారథాన్‌ను మంత్రి హరీశ్‌ రావు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ ఫుల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో స్విమ్మింగ్ పోటీలు, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీల సెలెక్షన్స్‌కు, క్రికెట్ సెలెక్షన్స్‌ జరిగాయని చెప్పారు. జాతీయ స్థాయిలో హ్యాండ్‌బాల్ పోటీలకు సిద్దిపేట వేదికైందని వెల్లడించారు..రంగనాయక సాగర్ వేదికగా రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు జరిగాయని, నేడు సిద్దిపేట నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి చెప్పారు. ప్రతీరంగంలో పట్టణం ఆదర్శంగా నిలవాలని, ప్రతిఒక్కరికి స్ఫూర్తి చాటాలన్నదే తన తపన అని వెల్లడించారు. కాగా, హాఫ్ మారథాన్ కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పుడే అద్భుతమైన స్పందన వచ్చిందని, రన్నింగ్ చేసే వారు ఇంత మంది ఉంటాంటేనే ఆశ్చర్యం కలిగిందని తెలిపారు.

ఇది ఆరంభం మాత్రమేనని, ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. రన్నింగ్‌ అనేది మన దినచర్యలో ఒక భాగం కావాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యంమని, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఏడాది హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్ నిర్వహించడం మొదటి సారని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వరకు 100 కి. మీ పరుగు చేయడం సంతోషకరం మన్నారు.

నేడు జరిగిన హాఫ్ మారథాన్ నా భూతొ నా భవిష్యత్తు అన్నట్టు నిర్వహించార‌న్నారు.. హాఫ్ మారథాన్ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హ‌రీష్ రావు. లైఫ్ స్పాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నరేందర్ సిఎస్ఆర్ ద్వారా తన వంతు సహకారం అందించారంటూ అలాగే . నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంపెనీ ప్రతినిధులు సిఎస్ఆర్
ద్వారా, యూనియన్ బ్యాంక్ సిద్దిపేట బ్రాంచ్ సిఎస్ఆర్ ద్వారా తన వంతు సహకారం అందించార‌ని వివ‌రించారు..

- Advertisement -

సిద్దిపేట హాఫ్ మారథాన్ బ్రాండ్ అంబాసిడర్స్, హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డా.నాగ లక్ష్మి , 56 ఏళ్ల వ‌య‌స్సులో హాఫ్ మారతాన్ రన్ మద్దతుగా హైదరాబాదు నుండి రంగనాయక సాగర్ ప్రాజెక్టు వరకు 100 కె సైక్లింగ్ చేసుకుంటూ వచ్చి మహిళలలో మంచి స్ఫూర్తిని నింపార‌న్నారు.. సిద్దిపేట జిల్లా వాస్తవ్యుడు శ్రీకాంత్ తాడూరి గారు సిద్దిపేట హాఫ్ మారతాన్ రన్ మద్దతుగా సికింద్రాబాద్ నుండి తన మిత్రబృందంతో కలిసి రంగనాయక సాగర్ వరకు100 కె రన్ చేసుకుంటూ వచ్చి యువకులలో మరింత ఉత్సవాన్ని నింపారంటూ వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి…

Advertisement

తాజా వార్తలు

Advertisement