Saturday, January 4, 2025

Harihara Veeramallu – ఆరో తేదిన పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ సినిమా షూటింలో పవర్ స్టార్ ఇటీవల పాల్గొన్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ప్రకటించారు. హరిహర వీరమల్లు లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ న మేకర్స్ ఫైనల్ గా వెల్లడించారు. పవర్ స్టార్ ఆలపించిన మాట వినాలి అనే సాంగ్ ను జవనరీ 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దింతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement