Monday, November 25, 2024

MDK: బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ నేత

మాజీ సీఎం, గులాబీ బాస్ కు అత్యంత సన్నిహితుడు
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మదన్ రెడ్డి
నర్సాపూర్ నుంచి భారీ అనుచర గణంతో గాంధీభవన్ కు విచ్చేసిన మదన్ రెడ్డి

మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమానంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నేతృత్వంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి, ఎలక్షన్ రెడ్డిలకు కండువా కప్పిన ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత చిలుముల మదన్ రెడ్డి ఆ పార్టీని వీడారు. సోమవారం భారీ అనుచర గ‌ణంతో కలిసి మదన్ రెడ్డి గాంధీభవన్ కు చేరుకున్నారు. గాంధీభవన్ వెలుపల నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి కండువా కప్పి మదన్ రెడ్డిని, ఎలక్షన్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ ఎంపీ ఎన్నికల వేళ మెదక్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పర్యాయాలు నర్సాపూర్ శాసనసభ్యులుగా ఎన్నికైన మదన్ రెడ్డికి మెదక్ జిల్లాలో పట్టున్న లీడర్ గా పేరుంది. ఈ పార్లమెంటు ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తరపున నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి దాదాపు 2వేల మంది నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు..
దూలపల్లిలోని సీతారామచంద్రస్వామి, విశాలాక్షి విశ్వేశ్వర ఆలయాన్ని మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సందర్శించారు. దూలపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర దేవస్థానాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధుతో పూజారులు శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామివారి ఆశీషులతో అందరూ బాగుండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టి.చంద్రపాల్, కొంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, రాజేష్, రుద్రారం మాజీ సర్పంచ్, గణేష్ గడ్డ టెంపుల్ చైర్మన్ కుర్మ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement