మరిపెడ, (ప్రభ న్యూస్): వాళ్లిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు.. పోలీసుల సమక్షంలో సమక్షంలో ఇద్దరు ఒక్కటైయ్యారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో రెండు నెలలకే కట్నం వేధింపులు మొదలయ్యాయి. అత్తింటింకి తీసుకేళ్లకుండా పరారైన భర్తపై కోపంతో ఆ మహిళ ఆందోళనకు దిగింది. భర్త స్వగ్రామంలో ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది.. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో ఆదివారం జరిగింది. బాధితతురాలు మమత తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మీసాల మమత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటోంది. కాగా, అదే వీధిలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన ఎర్ర చందు కార్ డ్రైవింగ్ చేస్తూ వేరే జీవనం సాగిస్తున్నాడు. ఒకే వీధిలో ఉంటున్న మమత, చందు మధ్య పరిచయం ఏర్పడింది.. క్రమేణా ప్రేమగా మారింది. ఐదేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకొమ్మని మమత ఒత్తిడి తేచ్చి హయత్‌నగర్ పోలీసుల సహకారంతో ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది.
అనంతరం కారు కొనుక్కుంటానంటే కట్నం కింద తన తల్లిదండ్రులు రూ.4లక్షలు ఇచ్చారని బాధితురాలు మమత తెలిపింది. ఆ తర్వాత వివాహమైన నెలనుంచి కుటుంబ సభ్యుల మాట వింటూ చందు అదనపు కట్నం కింద మరో రూ.10లక్షలు ఇవ్వాలని లేకుంటే అత్తింటికి తీసుకెళ్లనని వేధింపులు ప్రారంభించాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పలు మార్లు పంచాయితీ చేశామని, అందరి ముందు నటించి మళ్లీ తిరిగి అదే తంతు కొనసాగిస్తు అదనపుకట్నం తేవాలంటూ వేధిస్తున్నాడని వాపోయింది. నెల రోజుల నుంచి కనబడకుండా మయమయ్యాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో చేసేదిలేక తనకు న్యాయం చేయాలంటూ పెళ్లి ఫోటోలు వీడియోలతో తానంచర్లలోని భర్త ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది.