Saturday, September 14, 2024

Happy Sunday – ర‌మ‌ణీయం, క‌మ‌నీయం ఈ వ‌న్య‌ప్రాణి సోయ‌గం – సంతోష్ కుమార్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ …హైద‌రాబాద్ – గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ప‌చ్చద‌నాన్ని దేశ‌మంతా పంచుతున్న బిఆర్ఎస్ మాజీ ఎంపి జె సంతోష్ కుమార్ ఫోటో గ్ర‌ఫీపై కూడా ఆయ‌న‌కు మ‌క్కువ ఎక్కువ‌.. ఒక వైపు రాజ‌కీయాల్లోనూ, గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న కెమెరాకు ప‌ని చేపుతున్నారు.. ప్ర‌కృతిని ఆరాధించే సంతోష్ త‌న ఫోటోగ్ర‌పీ లోనూ ప్ర‌కృతి అందాల‌పైనా, ర‌మ‌ణీయ‌ అడ‌వుల‌లో వ‌న్య ప్రాణుల‌ పైనా దృష్టి పెట్టారు.. సండే ఫొటో స్టోరీ పేరుతో తాను కొన్ని ఫొటోలను నేడు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో షేర్​ చేశారు. హ్యాపీ సండే పేరుతో ఆయన ఆడ‌వికే అందాన్ని ఇచ్చే జింక‌ల ఫిక్స్ ను పోస్ట్ చేశారు. ప‌కృతిలో మ‌మేకమ‌వుతూ, స్వ‌చ్చ‌గా విహ‌రిస్తున్న ఆ జింక‌ల విన్యాసాలు అబ్బుర‌ప‌రిచేలా ఉన్నాయి.. ఈ సండే రోజున అవి అంద‌రిలో వైబ్స్ నింపుతాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.. స‌హ‌జమైన ప్ర‌కృతిని ఎంతో అందంగా క్లిక్ చేసిన ఆయ‌న‌ను ప‌లువురు అభినంద‌న‌ల‌తో ముంచేత్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement