Tuesday, November 19, 2024

Happy Movement – ఆ ఫోటోల‌తో రేవంత్ ఫిదా…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ జర్నలిస్ట్ పంపిన ఫోటో సంచలనంగా మారింది. ఆ ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారంటూ చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే.. చాలా ఆనందం వేసిందని తెలిపారు. ఒక జర్నలిస్టు మిత్రుడు ఈ ఫోటో తీసి నాకు పంపాడు. అది చూసిన నాకు చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ వేదిగా పోస్ట్ చేశారు రేవంత్ . ఫ్రీ బస్సు జర్నీ మహిళల కోసమే కాకుండా సూళ్లకు వెళ్లే బాలిక‌ల‌కు కూడా ఎంత ఉపయోగ పడుతుందో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మా కాంగ్రేస్ సర్కారు పాలన అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement