Thursday, December 26, 2024

Happy Christmas – మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు – పాల్గొన్న రేవంత్ రెడ్డి

మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు
రేవంత్ కు బిషప్ ల ఆశీర్వచనం
క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

మెద‌క్ – క్రిస్మస్ పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ చర్చిని సందర్శించారు.. ఈ సందర్భంగా ఇక్క‌డ జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లో పాల్గొన్నారు.. అనంత‌రం చ‌ర్చి బిష‌ప్ ఆయ‌న‌కు ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు.. అలాగే రేవంత్ క్రైస్త‌వులకు పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.. అంత‌కు ముందు ఆయ‌న చ‌ర్చిలోని అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించారు.. ఇక మెద‌క్ చ‌ర్చికి వ‌చ్చిన ఆయ‌న‌కు బిష‌ప్, ఫాద‌ర్లు, క్రైస్త‌వ మ‌త పెద్ద‌లు స్వాగతం ప‌లికారు.


ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా చ‌ర్చి ప్రార్ధ‌న‌లో పాల్గొన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement