Friday, November 22, 2024

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి స‌బితా

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాల‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా డిపిఆర్సి భవన్ లో జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజ‌రై మందుగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంత‌రం ఆమె మాట్లాడుతూ… ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 3 శాతం నుండి 4 శాతానికి పెంచిన ఘ‌న‌త‌ తెలంగాణ ప్రభుత్వానిదేన‌న్నారు. ఎక్కడ కూడా దివ్యాంగులనే భావన ఉండవద్దన్నారు. ఎవరు కూడా వీరిపై చిన్న చూపు చూడ‌వద్దని, సమాజంలో అందరితో పాటు వీరి అభివృద్ధిని కాంక్షించాలని.. ఆ దిశగా ముఖ్యమంత్రి వీరి గౌరవాన్ని పెంచేలా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5 శాతం వికలాంగులకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులకు 300 ఉన్న పెన్షన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3వేలకు పెంచారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి నెలా దాదాపు 5 లక్షల మందికి రూ.3,016 ల ఆసరా పెన్షన్లు అందిస్తున్నామ‌న్నారు.

దేశంలోని ఇతర రాష్టాల్లో 70శాతం అంగ వైకల్యం ఉంటేనే ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని, తెలంగాణలో మాత్రం 45శాతం వైకల్యం ఉన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సామాజిక సమైక్యతలో భాగంగా వికలాంగులు, సాధారణ వ్యక్తుల మధ్య వివాహాలను ప్రోత్సహించటానికి రూ.50 వేల నగదు ప్రోత్సాహం ఉండగా.. ప్రస్తుతం అది లక్ష కు పెంచటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ సంవత్సరంలో 20 మందికి వివాహ ప్రోత్సహకం అందించామ‌న్నారు. వికలాంగులకు ఉచితంగా ట్రే సైకిల్స్, వీల్ ఛైర్స్, చెవి మిష‌న్లు, ఊత కర్రలు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వమ‌న్నారు. వికలాంగుల కో అపరేటివ్ సంస్థ ద్వారా బ్రెయలి పలకలు, లాప్ టాప్ లు, మోటారు యంత్రాలు, ఎంపీ3 ప్లేయర్స్, డిగ్రీ, పీజీ చదివే ఎక్కువ శాతం అంగవైకల్యం డిగ్రీ, పీజీ చదివే వారికి మోటరైస్ట్ వెహికిల్ లు అందిస్తున్నామ‌న్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా వికలాంగులకు లాప్ టాప్ లు, మోటార్ బైక్ లు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందరి తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామ‌న్నారు. ఉపాధి హామీ కింద బాగా పని చేసిన వికలాంగులకు మంత్రి, జడ్పీ చైర్మన్ ల చేతుల మీదుగా సన్మానం చేస్తున్నామ‌న్నారు. సబ్సిడీ కింద అంగవైకల్యం ఉన్న 8 మందికి 16 లక్షల చెక్కులు అందించారన్నారు. అంగన్ వాడీ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసారన్నారు. ఫ్లోరైడ్ నీటి ద్వారా గతంలో చాలా మంది వికలాంగులుగా మారే వారని, ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుండటంతో ఆ సమస్య కూడా చాలా వరకు తీరింద‌న్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా లైబ్రరీ, డిసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్లు మురళీకృష్ణ, మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మహిళ, శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయో వృద్ధుల అధికారి లలిత, వికలాంగులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement