నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జూన్ 9) ప్రభ న్యూస్…అనునిత్యం విధులు నిర్వహిస్తూ ప్రజా శ్రేయస్సుకు పాటుపడేవారు పోలీసులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.జిల్లా ఎస్పీ కే. మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన భాడా ఖాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రీ జోన్ కాదురా హైదరాబాద్ మాదిరా అనే నిదానతం తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిల్చిందని అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్నామని అందుకోసం ఎందరో అమరులు చేసుకున్నారని వారిలో పోలీసు మిత్రులు కూడా ఉన్నారని తెలియజేశారు. ఉద్యమం కోసం పోలీసు మిత్రులు కూడా కెరియర్ త్యాగాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత చూసుకుంటే ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించేందుకు ఎన్నో సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రం రాకా ముందు పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేసేవారని జిల్లా ఎస్పీకే మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పరిస్థితులు దగ్గరగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అన్ని సౌకర్యాలు సమకూర్చి ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదరపు ఎస్పి సి.హెచ్. రామేశ్వరరావు డీఎస్పీలు మోహన్ కుమార్ ,కృష్ణ కిషోర్ ,టీ భరత్, సిఐలు అనుదీప్, రామకృష్ణ, యాలాద్రి, సైదులు, మరియు ఎస్సైలు ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.