Saturday, November 23, 2024

దొడ్డు రకం వడ్లను కొనరా? కిషన్ రెడ్డికి గుత్తా సూటి ప్రశ్న

కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పక్కకు పెట్టిందని విమర్శించారు. హన్మకొండలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు కనీసం ఊసెత్తడం లేదని మండిపడ్డారు. మహారాష్ట్రకు మాత్రం కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తాననడాన్ని స్వాగతిస్తున్నాని గుత్తా చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు రకం వడ్లను కొనేది లేదన్న ఎఫ్‌సీఐ ప్రకటనపై కిషన్ రెడ్డి తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని గుత్తా సుఖేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement