Saturday, November 23, 2024

ఆయన బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ః గుత్తా సుఖేందర్‌

తెలంగాణ విమోచన దినోత్సవంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. బీజేపీ సెప్టెంబర్‌ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ పార్టీ హిందుత్వాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఏంఐఎం పార్టీని బూచిగా చూపెట్టి హిందువులను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ లో సుస్థిర పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఆయన బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడరని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండిః మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ

Advertisement

తాజా వార్తలు

Advertisement