తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యం అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్, బీజేపీలు నిర్వీర్యం చేశాయని చెప్పారు. గవర్నర్ పాత్రను రాజకీయంగా పరిమితం చేశాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత బీజేపీకి లేదన్నారు. శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలకు గవర్నర్‌ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ ప్రొరోగ్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో సుభిక్షమైన, సుస్థిర పరిపాలన కొనసాగితుందని చెప్పారు. ఉభయ జాతీయ పార్టీలు దేశ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ పరంగా ఎవరి సేవలు ఉపయోగించుకోవలనేది టీఆర్‌ఎస్ వ్యక్తిగత అంశమన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement