Friday, October 4, 2024

Gun Fire – హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం .. స్నాచింగ్ ముఠాపై కాల్పులు…

నగరంలో ఒకవైపు హత్యలు, ఆత్మహత్యలు మరోవైపు స్నాచింగ్ ముఠాలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుస హత్యలతో భాగ్యనగరం అట్టడుకుతుంటే మరోవైపు దొంగల ముఠా హడలెత్తిస్తున్నారు. కాగా గ‌త రాత్రి దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనే హైదరాబాద్ లోని చిలకలగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది.
శుక్రవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో అంటి డేకాయిట్ టీం స‌భ్యుడు మెట్టుగూడా ప్రాంతంలో సర్ప్రైజ్ ఆపరేషన్ లో భాగంగా ఫూట్ పాత్ పై కాపు కాశారు. అయితే అక్కడకు ముగ్గురు దుండగులు వచ్చారు. కాపు కాసిన వ్య‌క్తి నుంచి సెల్ ఫోన్ దొంగలించడానికి ప్రయత్నం చేశారు..

ఆలాగే వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి అరుపులకు కొద్ది దూరంలో ఉన్న అంటి డేకాయిట్ టీం అలర్ట్ అయ్యింది. ముగ్గురు దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో అంటి డేకాయిట్ టీంకు నలుగురి మధ్య తోపులాట జరిగింది. దీంతో సెల్‌ ఫోన్‌ దొంగలను బెదిరించడానికి డేకాయిట్ టీమ్ సభ్యుడు ఒకరు రివాల్వర్ బయటకు తీశాడు. అలాగే ఫైరింగ్ కూడా చేశాడు.. అయితే వీరి మధ్య తోపులాటలో గన్‌ మిస్ ఫైర్ అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. ఎవరికి ఎటువంటి హానీ కాలేదు. దీంతో దుండగలు భయంతో అక్కడి నుంచి పరార్‌ అయ్యారు. అయితే వారిని వెంబడించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement